యాంగ్రీ స్టార్ రాజశేఖర్ ప్రస్తుతం ఓ సాలిడ్ కమ్ బ్యాక్ ఇవ్వాలని గట్టిగానే ప్రయత్నిస్తుంది. దీని కోసం మంచి స్కోప్ ఉన్న పాత్రలతో పాటు హీరోగాను తనకు ఏదైనా పర్ఫెక్ట్ కథ తగలాలని వెయిట్ చేస్తున్నాడు. అయితే, ఆయన తాజాగా ఓ చిత్ర హక్కులను దక్కించుకున్నట్లు తెలుస్తోంది. తమిళంలో గత ఏడాది రిలీజ్ అయిన ‘లబ్బర్ పందు’ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది.
క్రికెట్ నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ డ్రామా చిత్రమిది. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. దీంతో ఇప్పుడు ఈ సినిమా రీమేక్ రైట్స్‌ను రాజశేఖర్ దక్కించుకున్నారట. ఈ సినిమాలో జీతూ పాత్రలో రాజశేఖర్ నటించాలని చూస్తున్నాడట. ఇక మరో యంగ్ హీరో కోసం కూడా ఆయన అన్వేషణ సాగిస్తున్నట్లు తెలుస్తోంది. అటు ఈ సినిమాను హ్యాండిల్ చేసే డైరెక్టర్ కోసం కూడా రాజశేఖర్ వెతుకుతున్నట్లు ఓ టాక్ వినపడుతుంది.
అయితే, ఈ సినిమా ఇప్పటికే ఓటీటీలో అందుబాటులో ఉంది. మరి ఈ చిత్రాన్ని రీమేక్ చేసి తిరిగి థియేటర్లలో రిలీజ్ చేస్తే ప్రేక్షకులు ఎంతమేర ఆదరిస్తారు అనేది పెద్ద ప్రశ్నగా మారింది.