టాలెంటెడ్ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం “కింగ్డమ్” మీద పెద్ద ఎక్స్‌పెక్టేషన్స్ ఏర్పడ్డాయి. ఈ సినిమా విజయ్ కెరీర్‌లో ఇప్పటివరకు వచ్చిన చిత్రాల్లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. ఇప్పటికే షూటింగ్‌కు సంబంధించిన స్టిల్స్, లుక్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
తాజాగా విజయ్ దేవరకొండ షేర్ చేసిన ఓ ఫోటో ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్ అయింది. ఈ ఫోటోలో ఆయన దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో కలిసి కనిపించగా, విజయ్ బాడీ లాంగ్వేజ్, స్టైల్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. మాస్ లుక్స్‌తో దూకుడు నింపినట్టు ఉన్న ఈ స్టిల్ చూసిన అభిమానులు సినిమా మీద మరింత ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.
ఈ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ అందిస్తుండగా, నాగవంశీ మరియు త్రివిక్రమ్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అన్ని భాషల్లో ఒకేసారి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తుండగా, ఈ సినిమా జూలై 4న పాన్ ఇండియా లెవెల్లో థియేటర్లలోకి రానుంది.