మెగాస్టార్ చిరంజీవి, త్రిషల కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న భారీ సినిమా విశ్వంభర మీద అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. దర్శకుడు వశిష్ఠ ఈ సినిమాను గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారనే టాక్ ఇప్పటికే ఫ్యాన్స్ లోకి వెళ్లిపోయింది. షూటింగ్ నుంచి రిలీజ్ వరకు అన్ని విషయాల్లో ఈ సినిమా హైప్ పెంచుకుంటూ వస్తోంది.
ఇప్పుడు ఈ సినిమాతో సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ బజ్ ఫిల్మ్ నగర్ లో హల్‌చల్ చేస్తోంది. బాలీవుడ్ గ్లామర్ బ్యూటీ మౌని రాయ్ ఈ సినిమాకో ప్రత్యేక పాటలో స్టెప్పులు వేయనుందని టాక్. ఇది కేవలం స్పెషల్ సాంగ్ మాత్రమే కాకుండా ఓ పాపులర్ పాట రీమిక్స్ అని కూడా చెబుతున్నారు.
మెగాస్టార్ గత హిట్ మూవీ అన్నయ్య లో వచ్చిన “ఆట కావాలా పాట కావాలా” అనే మాస్ సాంగ్‌ను ఈ సినిమా కోసం రీడిజైన్ చేస్తున్నారని వినిపిస్తోంది. అదే పాటను మౌని రాయ్ స్టెప్పులతో మరింత స్టైలిష్‌గా చూపించేందుకు ప్లాన్ చేస్తున్నారట.
ఇక ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియాలంటే అధికారిక అప్డేట్ కోసం వేచి చూడాల్సిందే. కానీ ప్రస్తుతం ఈ బజ్ మాత్రం అభిమానుల్లో మరో స్థాయిలో ఉత్కంఠను రేపుతోంది. విశ్వంభర ఇప్పటికే భారీ లెవెల్లో తెరకెక్కుతుండగా, ఇప్పుడు ఈ రీమిక్స్ సాంగ్ టాక్ కూడా సినిమాపై క్రేజ్‌ను మరింత పెంచేలా మారుతోంది.