బరిలోకి దిగుతున్న పొట్టేలు!

యువచంద్రకృష్ణ, అనన్య నాగళ్ల జంటగా నటించిన సినిమా ‘పొట్టేలు’. సాహిత్ మోత్కూరి దర్శకుడు. సురేష్‌కుమార్ సడేగే, నిశాంత్ నిర్మాతలు. ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. పూర్తి గ్రామీణ వాతావరణంలోని సంప్రదాయాలు, నమ్మకాల సమాహారంగా ఈ సినిమాను తీర్చిదిద్దారు. ఈ సినిమాకు శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నాడు.

 ఒక పల్లెటూళ్ళో జరిగే కథలా, ఒక ఫ్యామిలీని ఊరంతా కొట్టడానికి ప్రయత్నిస్తున్నట్టు, అలాగే పేద, ధనిక బేధం చూపిస్తూ, కథలో పొట్టేలు కూడా ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నట్టు, కొత్త పాయింట్ తో పొట్టేలు సినిమాని తెరకెక్కించినట్టు తెలుస్తుంది. నటీనటుల పెర్ఫార్మెన్స్ మాత్రమే కాదు, సాంకేతికంగా కూడా సినిమా చాలా బాగున్నట్లు అనిపిస్తుంది.

కొన్నేళ్లు గుర్తుండిపోయే సినిమా ఇది అని చిత్ర బృందం తెలిపింది. వినోదం, సందేశం మేళవించిన కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించారు. అజయ్, ప్రియాంకశర్మ, తనస్వి చౌదరి, నోయల్‌సేన్, ఛత్రపతి శేఖర్, శ్రీకాంత్ అయ్యంగార్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను దీపావళి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 25న విడుదల చేయబోతున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు.

Related Posts

Comments

spot_img

Recent Stories