యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి నటిస్తున్న తాజా సినిమా ‘అనగనగా ఒక రాజు’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమాను గతంలోనే ప్రకటించినప్పటికీ, షూటింగ్ ఆలస్యం అవుతుండటంతో ఈ మూవీ ఉందా లేదా అనే సందేహం ప్రేక్షకుల్లో ఏర్పడింది. అయితే, ఈ సందేహాలకు చెక్ పెడుతూ ఈ మూవీ కన్ఫమ్‌గా ఉందంటూ ఓ వీడియో ప్రోమోతో ఆసక్తిని క్రియేట్ చేశారు మేకర్స్.
ఇక తాజాగా నవీన్ పొలిశెట్టి పుట్టినరోజు కానుకగా ‘అనగనగా ఒక రాజు’ మూవీకి సంబంధించి ‘ప్రీ-వెడ్డింగ్ వీడియో’ను ప్రేక్షకుల ముందుకుతీసుకు వచ్చారు. ఈ వీడియోలో తన పెళ్లికి సంబంధించి ప్లానింగ్ చేస్తున్న హీరో, అంబానీల పెళ్లితో తన పెళ్లిని పోల్చుకుంటూ చేసుకుంటున్నట్లు కనిపించాడు.
ఇక తనకు కాబోయే భార్యగా హీరోయిన్ మీనాక్షి చౌదరి ఎంట్రీ ఇస్తుంది. వారిద్దరు కలిసి ఫోటోగ్రాఫర్ చెప్పినట్లుగా ఫోజులు ఇస్తూ సందడి చేశారు. నవీన్ మరోసారి తన టైమింగ్‌తో అదరగొట్టాడు.ఈ సినిమాను మారి డైరెక్ట్ చేస్తుండగా మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.