కింగ్డమ్‌ నుంచి పవర్‌ ఫుల్ అప్డేట్‌ ఎప్పుడంటే..!

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా నటించిన తాజా పాన్ ఇండియా చిత్రం కింగ్డమ్ ఓ ఇంట్రెస్టింగ్ పాయింట్ చుట్టూ భారీ అంచనాలతో తెరకెక్కుతోంది. ఈ సినిమాకి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించగా, హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సే నటిస్తోంది. మొదటి నుంచి ఈ సినిమాపై అద్భుతమైన బజ్ నెలకొంది. కానీ విడుదల విషయంలో మాత్రం కాస్త ఊహించని రీతిలో జాప్యం కొనసాగింది. మళ్లీ మళ్లీ డేట్ వాయిదా పడుతూ ఉండటంతో ఫ్యాన్స్ కొంత నిరాశకు గురయ్యారు.

ఇక ఫైనల్‌గా రిలీజ్ డేట్ ఎప్పుడు ఖరారవుతుందా అనే ఉత్కంఠే అందరిలోనూ కనిపిస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం జూలై 7న చిత్ర యూనిట్ నుంచి ఓ స్పష్టమైన అప్డేట్ రాబోతుందంటూ టాక్ వినిపిస్తోంది. ఇక ఇదే నిజమైతే ఆగస్ట్ మొదటి వారం కింగ్‌డమ్ థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

ఈ సినిమా మ్యూజిక్‌ను అనిరుధ్ అందిస్తుండగా, నాగవంశీ మరియు సాయి సౌజన్య సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. గత సినిమాల్లో విజయ్ దేవరకొండ చూపిన ఎనర్జీకి గౌతమ్ తిన్ననూరి ప్రత్యేకంగా ఫీల్ కలిపి ఈ కథను తెరకెక్కించారని టాక్. ఇక జూలై 7న విడుదల తేదీపై పూర్తి క్లారిటీ రానున్న నేపథ్యంలో, ఫ్యాన్స్ మాత్రం ఫుల్ జోష్‌లో ఎదురుచూస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories