చైతూ కెరీర్లోనే సరికొత్త రికార్డు!

చైతూ కెరీర్లోనే సరికొత్త రికార్డు! యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి కాంబోలో వచ్చిన మూవీ ‘తండేల్’. చందూ మొండేటి డైరెక్షన్‌ లో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా థియేటర్ల వద్ద ‘తండేల్’ మూవీ కలెక్షన్ల ప్రభంజనం కొనసాగుతోంది. విడుదలైన మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.62.47 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లు చేసినట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. అక్కినేని నాగచైతన్య కెరీర్లో ఇవే అత్యంత వేగవంతమైన కలెక్షన్లని చిత్రబృందం తెలియజేసింది. మొత్తానికి ఈ సినిమాలో మ్యూజిక్‌తో పాటు చైతన్య, సాయి పల్లవి నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. కొన్ని బస్సుల్లో ‘తండేల్’ పైరసీ వెర్షన్ ప్రదర్శన చేసినట్లుగా తమ దృష్టికి వచ్చినట్లు నిర్మాత బన్నీ వాసు ట్వీట్ చేశారు. ఇలా ప్రదర్శన చేయడం చట్టవిరుద్ధమని, సినిమాను తెరకెక్కించేందుకు కష్టపడిన వారికి అవమానమని ఆయన అన్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories