టెండరు దక్కాక కొత్త నాటకం : జగన్ పాత్ర ఎంత?

జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఒక సంస్థ ప్రభుత్వంతో ఒక టెండరు దక్కించుకోవడం ద్వారా డీల్ లోకి ఎంటరైంది. ఆ డీల్ ఏర్పాటు చేసుకోవడం వెనుక వారికీ వారికీ మధ్య సవాలక్ష లోలోపలి విషయాలున్నాయి. అవన్నీ నెరవేర్చుకోవచ్చునని అనుకుంటున్న సమయంలోనే.. జగన్ ప్రభుత్వం కుప్పకూలింది. ఆ సంస్థకు గుండెల్లో రాయిపడినట్లయింది. ఇప్పుడు ఆ టెండరు ద్వారా తాము అనుకున్న రీతిగా దోచుకోవడం కుదరదు. కాబట్టి టెండరు రద్దు చేసుకుంటే చెడ్డపేరు. తాము అడగకుండానే టెండరు రద్దయిపోయేలా పన్నాగాలు పన్నుతోంది. టెండరు నిబంధనల్లో కొన్ని మారిస్తే తప్ప తాము ఒప్పందం చేసుకోబోం అంటూ భీష్మించుకుంటోంది.

ప్రకాశం జిల్లాలో ఇనుప ఖనిజ ప్రాజెక్టును ఒక ప్రణాళిక ప్రకారం దోచుకోవడానికి గత ప్రభుత్వ హయాంలో కుట్ర జరిగినట్టుగా కనిపిస్తోంది. దీనికోసం టెండరు పిలిస్తే జిందాల్ గ్రూపునకు చెందిన రెండు సంస్థలు మాత్రమే టెండర్లు వేశాయి,ఒకరికి టెండరు దక్కింది. వాళ్లు ఖనిజం తవ్వి అమ్మకాల్లో కొంత శాతం ప్రభుత్వానికి చెల్లించాలి. కానీ ఆ మేరకు వారు ఒప్పందమే ఇంకా చేసుకోలేదు. ఆరునెలలుగా స్పందించకుండా కూర్చుని ఇప్పుడు కొత్తప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిబంధనలు మార్చాలంటున్నారు.

టెండర్లలో డిఫాల్టుగా ఉండే రూల్సుకూడా మార్చాలని అనడం చిత్రమైన సంగతి. సాధారణంగా ప్రతి టెండరులోనూ పని సమస్తం మొదలుపెట్టిన తర్వాత.. ఏ నిమిషంలోనైనా టెండరును రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని ఒక నిబంధన చేరుస్తారు. ఇది డిఫాల్టుగా ఉండే అన్ని రూల్సు లాంటిదే. అన్నిచోట్లా ఉంటుంది. కానీ దీనిని కూడా మార్చాలనడం ద్వారా.. జిందాల్ గ్రూపు పనిచేసే ఉద్దేశంతో లేదని అర్థమవుతోంది.

ఈ టెండరును మర్చిపోవాల్సిందేని..    పలువురు అంటున్నారు. దీనిని పూర్తిగా రద్దుచేసి కొత్త టెండర్లకు వెళ్లాలని, జిందాల్ గ్రూపుతో పాటు ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారని తెలుస్తొంది.

Related Posts

Comments

spot_img

Recent Stories