కొత్త డేట్‌ వచ్చేసింది!

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ గా చేసిన లేటేస్ట్‌ సినిమా “కంగువా”. దర్శకుడు శివతో చేసిన ఈ సెన్సేషనల్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా విడుదలని మరోసారి వాయిదా వేస్తున్నట్టుగా కొన్ని రోజులు కితమే మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. అయితే దీని తర్వాత కొత్త విడుదల తేదీ అనేది సస్పెన్స్ గా మారగా నవంబర్ విడుదల అన్నట్టుగా పలు రూమర్స్ వచ్చాయి.

 అయితే ఈ సస్పెన్స్ పై ఫైనల్ గా మూవీ మేకర్స్ ఓ అప్డేట్‌ ఇచ్చారు.  మరి వచ్చిన రూమర్స్ ప్రకారం డేట్ నే అఫీషియల్ గా మేకర్స్ ప్రకటించారు. దీంతో ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ గా నవంబర్ 14న విడుదలకి తీసుకొంటున్నట్టుగా ప్రకటించేసారు. దీంతో అభిమానులు ఎదురు చూస్తున్న సస్పెన్స్ కి తెరపడింది అనే చెప్పుకొవచ్చు.

 ఈ భారీ సినిమాలో దిశా పటాని హీరోయిన్ గా నటించగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు.   అలాగే స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ వారు సంయుక్తంగా నిర్మాణ బాధ్యతలు చేపట్టారు.

Related Posts

Comments

spot_img

Recent Stories