రేసింగ్‌ ట్రాక్‌ దగ్గర కొత్త జంట!

అక్కినేని యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య  హీరోగా నటించిన చిత్రం తండేల్ తో తాజాగా సెన్సేషనల్ హిట్ కొట్టి మంచి కంబ్యాక్ అందుకున్నాడు. అయితే ఈ కంబ్యాక్ తమ ఇంటి కోడలు శోభిత మహత్యం కూడా అని నాగార్జున వ్యాఖ్యానించడం వైరల్ అవుతుంది. ఇక ఇదిలా ఉండగా ఈ యంగ్ జంట తమ పెళ్లయ్యాక సినిమాలు చేస్తూనే తమ వైవాహిక బంధాన్ని కూడా బ్యూటిఫుల్ గా కొనసాగిస్తున్నారు.

అయితే తాజాగా ఈ జంటపై ఓ పిక్ మంచి మూమెంట్ గా వైరల్ అవుతుంది. నాగ చైతన్యకి రేసింగ్ అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిన విషయమే. చైతూకి సెపరేట్ కార్ అండ్ ట్రాక్స్ కూడా ఉన్నాయి. ఇలా ఇద్దరు జంటగా ఓ రేస్ ట్రాక్ దగ్గర కనిపించారు. దీంతో నాగ చైతన్యకి ఇష్టమైన రెండు అంశాలూ ఈ పిక్ లో కనిపించడంతో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఇది చూసిన అక్కినేని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories