పోరాట యోధునిగా నేచురల్‌ స్టార్‌!

దసరా కాంబో మరోసారి రిపీట్‌ కాబోతున్నట్లు ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. శ్రీకాంత్‌ ఓదెల..నాని కాంబోలో వచ్చిన దసరా సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈసారి కూడా శ్రీకాంత్‌ నాని కోసం ఓ అదిరిపోయే కథను రెడీ చేసినట్లు సమాచారం.

దసరా సినిమాలో నానిని శ్రీకాంత్‌ ఓ కొత్త అవతారంలో చూపించాడు. ఆ సినిమాలో నాని లుక్‌, మేకొవర్‌ ప్రేక్షకుల్ని మెస్మరైజ్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ సారి కూడా ఈ సినిమా కోసం తెలంగాణ బ్యాగ్రౌండ్‌ ఉండే కథని రాసుకున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా కథ 80 వ దశకంలో సాగుతుందని, అప్పటి నిజాం పరిపాలనలో సాగిన ఓ పోరాట యోధుని కథ ఆధారంగా శ్రీకాంత్‌ స్క్రిప్ట్‌ రాసుకున్నట్లు తెలుస్తుంది.

‘నిజమైన నాయకునికి ఐడెంటిటీ అవసరం లేదనే స్లోగన్‌ ను పోస్టర్‌ పై పెట్టారు. మొత్తానికి ఓ మాస్‌ కథానాయకుని కథతో ఈ సారి నాని తెరమీదకు రాబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రీ లుక్‌ పోస్టర్‌ కూడా చాలా బాగుంది.

Related Posts

Comments

spot_img

Recent Stories