క్లాస్ లుక్ తో మాస్ పోస్టర్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన అవైటెడ్ సినిమా ఇప్పుడు ఏదన్నా ఉంది అంటే అది కోలివుడ్‌ స్టార్‌  డైరెక్టర్‌ శంకర్ తో చేస్తున్న సినిమా  “గేమ్ ఛేంజర్” అనే చెప్పాలి. ఎప్పుడో మొదలైన ఈ సినిమా విడుదల ఎప్పుడు అనేది పెద్ద సస్పెన్స్ గా మారింది. అయితే ఈ భారీ సినిమా నుంచి నేడు వినాయక చవితి కానుకగా మేకర్స్ సాలిడ్ అప్డేట్ ని అందిస్తున్నట్టుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. మరి ఎట్టకేలకి ఈ అప్డేట్ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.

మేకర్స్ ఫ్యాన్స్ కి ఫీస్ట్ ఇచ్చే అప్డేట్ ని అయితే అందించారు అని తెలుస్తుంది. చరణ్ పై ఊహించని లెవెల్ మాస్ పోస్టర్ తో ఈ సినిమా తాలుకా రెండో సాంగ్ ని ఈ సెప్టెంబర్ లో విడుదల  చేస్తున్నట్టుగా ప్రకటించేశారు. మరి ఈ పోస్టర్ లో చరణ్ డ్రెస్సింగ్ చూస్తే క్లాస్ గా ఉన్నాడు కానీ తన తలకి ఎర్ర తువాలు, బ్యాక్గ్రౌండ్ లో చూస్తుంటే ఇదేదో మాస్ సాంగ్ లా కనపడుతుంది. మొత్తానికి అయితే ఈసారి ఫ్యాన్స్ మాస్ ఫీస్ట్ ఇవ్వబోతున్నారని తెలుస్తుంది.

ఇక ఈ భారీ సినిమాలో బాలీవుడ్‌ హీరోయిన్‌ కియారా అద్వానీ,  అలాగే తెలుగు ముద్దుగుమ్మ అంజలిలు నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు.

Related Posts

Comments

spot_img

Recent Stories