నోరు జారిన పొడుగు కాళ్ల సుందరి!

అందాల భామ పూజా హెగ్డే టాలీవుడ్ ప్రేక్షకులకు బాగా సుపరిచితురాలే. ఆమె టాలీవుడ్‌లో ఇంచుమించు అందరూ బిగ్ స్టార్స్ తోనూ సినిమాలు చేసేసిందని చెప్పుకోవచ్చు. అయితే, గతకొంత కాలంగా టాలీవుడ్‌లో సరైన హిట్స్ లేకపోవడంతో, ప్రస్తుతం ఆమె తన ఫోకస్ పూర్తిగా బాలీవుడ్‌పైనే పెట్టినట్లు తెలుస్తుంది.

అయితే, తాజాగా ఆమె నటించిన ‘దేవా’ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా పూజా హెగ్డే చేసిన ఓ స్టేట్మెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌ అవుతుంది.దక్షిణాదిలో తాను నటించిన ‘అల వైకుంఠపురములో’ తమిళ సినిమా అయినా కూడా హిందీ ఆడియెన్స్ దానిని పాన్ ఇండియా మూవీగా చాలా బాగా ఆదరించారని.. పనితనం బాగుంటే, అది ప్రేక్షకులకు నచ్చుతుందని ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘అల వైకుంఠపురములో’ చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేశారు. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది.

ఇలా తాను నటించిన తెలుగు బ్లాక్ బస్టర్ చిత్రాన్ని తమిళ్ మూవీ అని చెప్పడంపై బన్నీ అభిమానులు పూజా హెగ్డేను సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories