సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన తాజా యాక్షన్ ఎంటర్‌టైనర్ కూలీ ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమాని లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేయగా, నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర వంటి స్టార్ హీరోలు కూడా ముఖ్య పాత్రల్లో కనిపించారు. రిలీజ్ కి ముందే పెద్ద ఎత్తున హైప్ క్రియేట్ చేసుకున్న ఈ చిత్రం, మొదటి రోజునే తమిళనాడులోనే కాకుండా హిందీ మార్కెట్‌లో కూడా మంచి రీతిలో ఆడుతోంది.
ప్రత్యేకంగా బాలీవుడ్ లో ఈ సినిమాకి రెస్పాన్స్ అద్భుతంగా వచ్చింది. మొదటి రోజునే 91 వేల టికెట్లు బుక్ కావడంతో మంచి స్టార్ట్ ఇచ్చింది. అంతటితో ఆగకుండా రెండో రోజుకి అది లక్షకు పైగా టికెట్ల వరకు వెళ్లింది. అదే సమయంలో బాలీవుడ్ స్ట్రైట్ ఫిల్మ్ అయిన వార్ 2 కూడా రన్ అవుతుండటంతో కూలీకి ఇంతటి ఆదరణ రావడం విశేషంగా మారింది. హిందీ వెర్షన్‌కి కూలీ ది పవర్ హౌస్ అనే టైటిల్ పెట్టి విడుదల చేశారు.
ఈ సినిమాకి అనిరుద్ మ్యూజిక్ అందించగా, సన్ పిక్చర్స్ భారీ స్థాయిలో నిర్మించింది. మొత్తంగా చెప్పుకోవాలంటే కూలీ తమిళంలో మాత్రమే కాకుండా హిందీలో కూడా బలమైన స్థాయిలో నిలబడుతూ రజినీకాంత్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని మరోసారి రుజువు చేస్తోంది.