యూత్‌ని టార్గెట్ చేసుకుని సినిమా హిట్ అయితే ఫలితం ఎంత వేరుగా ఉంటుందో తాజాగా వచ్చిన లిటిల్ హార్ట్స్ సినిమా చూపించింది. ఆ విజయానంతరం మేకర్స్ కూడా ఎక్కువగా యువతరాన్ని ఆకట్టుకునే కాన్సెప్ట్లపై దృష్టి పెడుతున్నారు. ఇప్పుడు అదే తరహా ఎంటర్టైన్మెంట్తో K-ర్యాంప్ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.
హీరో కిరణ్ అబ్బవరం క సినిమా తర్వాత ఈ ప్రాజెక్ట్‌లో నటిస్తుండగా, రిలీజ్ చేసిన గ్లింప్స్‌తోనే మంచి బజ్ క్రియేట్ అయింది. ఇప్పటివరకు బయటకు వచ్చిన కంటెంట్ యూత్‌ను బాగా ఎంగేజ్ చేసింది. ఇంకా మేకర్స్ దగ్గర నుంచి ఎన్నో సర్ప్రైజ్లు రాబోతున్నాయని సమాచారం. ప్రత్యేకంగా ఈ సినిమాలో దాదాపు 18 లిప్‌లాక్ సీన్స్ ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. వాటిని కూడా యువతరానికి కనెక్ట్ అయ్యేలా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ప్రమోషన్స్‌లో ఒక్కో సర్ప్రైజ్ని బయటపెట్టే ఆలోచనలో టీమ్ ఉందని చెప్పుకుంటున్నారు.
ప్రొడ్యూసర్ రాజేష్ దండా ఈ సినిమా ప్రమోషన్స్‌ను కూడా ప్రత్యేకంగా ప్లాన్ చేస్తున్నారని ఇండస్ట్రీలో టాక్. ఇప్పటికే ఓటీటీ, డబ్బింగ్ రైట్స్ డీల్స్ కూడా ముగిసినట్లు సమాచారం. దీపావళి సీజన్‌కి థియేటర్లలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. యూత్‌ని బాగా ఆకర్షించేలా అన్ని అంశాలు జాగ్రత్తగా మిక్స్ చేశారని తెలిసింది.