టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో పీపుల్ స్టార్ సందీప్ కిషన్ హీరోగా రీతూ వర్మ హీరోయిన్ గా దర్శకుడు త్రినాథరావు నక్కిన తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రమే “మజాకా”. ఈ చిత్రంలో రావు రమేష్ సహా మన్మథుడు ఫేమ్ అన్షు సాగర్ కూడా కీలక పాత్రలు పోషించగా థియేటర్స్ లో ఈ సినిమా సోసో గానే పెర్ఫామ్ చేసింది. ఇక ఈ చిత్రం ఇపుడు ఫైనల్ గా ఓటిటి ఆడియెన్స్ ని అలరించేందుకు వచ్చేసింది.
ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులని జీ5 సంస్థ కొనుగోలు చేయగా అందులో ఈ సినిమా నేడు మార్చ్ 28 నుంచి అందుబాటులోకి వచ్చేసింది. ఇక ఈ చిత్రాన్ని అప్పుడు మిస్ అయ్యి ఇపుడు చూడాలి అనుకునేవారు ఇపుడు ట్రై చేయవచ్చు. ఇక ఈ చిత్రానికి లియోన్ జేమ్స్ సంగీతం అందించగా రాజేష్ దండ, ఉమేష్ కే ఆర్ బన్సల్ లు నిర్మాణం వహించారు. అలాగే మురళీ శర్మ, హైపర్ ఆది తదితరులు నటించిన ఈ చిత్రాన్ని అనీల్ సుంకర సమర్పణలో రిలీజ్ చేశారు.