బన్నీ ఫ్యాన్స్ కు పండగే.. పండగ!

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం పుష్ప 2. సుకుమార్‌ కాంబోలో రాబోతున్న ఈ చిత్రం  గురించి బోలెడు ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే పుష్ప సినిమా ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాకి ఎన్నో అవార్డులను కూడా తెచ్చిపెట్టింది. అల్లు అర్జున్‌ ని జాతీయ నటుడిగా నిలబెట్టింది.

తాజాగా అల్లు అర్జున్ పుట్టిన రోజు రాబోతున్న సందర్భంగా మూవీ మేకర్స్ వరుస అప్‌డేట్స్‌ ఇవ్వడానికి రెడీ గా ఉన్నట్లు తెలుస్తుంది. ముందుగా ఓ మ్యాగజైన్‌ కోసం దుబాయ్‌, అబుదాబిలోని యాస్‌ మెరీనా సర్క్యూట్‌ లో కవర్ షూటింగ్‌ లో బన్నీ పాల్గొంటున్నారు. అంతేకాకంఉడా ఈ నెల 28న దుబాయ్‌ లోని మేడబ్‌ టుస్సాడ్స్‌లో తన మైనపు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఆయన హాజరుకానున్నారు.

ఆ తరువాత ఏప్రిల్ 8 న బన్నీ బర్త్‌ డే సందర్భంగా పుష్ప2 నుంచి ఓ అదిరిపోయే అప్‌ డేట్‌ రాబోతుందంట. మొత్తానికి బన్నీ ఫ్యాన్స్‌ కి మాత్రం ఈసారి సూపర్‌ ట్రీట్‌ లభించబోతుంది.

Related Posts

Comments

spot_img

Recent Stories