ఐడెంటిటీని పూర్తి చేసిన ముద్దుగుమ్మ!

సినీ పరిశ్రమకు వచ్చి 20 ఏళ్లు అయినప్పటికీ ఏ మాత్రం అందం తగ్గకుండా…తన అభినంయంతో అభిమానులను ఆకట్టుకుంటున్న నటి త్రిష. కొద్ది రోజుల క్రితం వరకు కూడా సినిమాలకు చాలా గ్యాప్‌ తీసుకున్న త్రిష  ‘పొన్నియన్ సెల్వన్’తో మళ్లీ  రేసులోకి వచ్చారు. ప్రస్తుతం అగ్ర హీరోల సరసన నటిస్తూ.. బిజీ బిజీగా ఉంది.

ప్రస్తుతం ఈ చెన్నై చిన్నదాని చేతిలో విశ్వంభర’, ‘థగ్‌ లైఫ్‌’ ‘విదాముయార్చి’ తదితర చిత్రాలు ఉన్నాయి. ఇంత బిజీలో కూడా ఆమె ఓ మలయాళ చిత్ర షూటింగ్‌ ను పూర్తి చేసింది. త్రిష, టోవినో థామస్‌ జంటగా నటిస్తున్న సినిమా ‘ఐడెంటిటీ’. అఖిల్‌ పాల్‌, అనాస్‌ఖాన్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో త్రిష తన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ను పూర్తి చేసిందని చిత్ర బృందం ప్రకటించింది.

ఈ విషయాన్ని చిత్ర బృందం తెలిపింది.ఈ సందర్భంగా  సోషల్‌ మీడియా వేదికగా కొన్ని ఫొటోల్ని పంచుకుంటూ.. ‘ఐడెంటిటీలో త్రిష పాత్రకు సంబందించిన చిత్రీకరణ కంప్లీట్‌ అయ్యింది. ఇంత బిజీ షెడ్యూల్‌లో కూడా ఆమె మా ప్రాజెక్టులో పాల్గొని సహకరించినందుకు చాలా సంతోషంగా ఉంది. మా మీద నమ్మకం ఉంచి మాకు సహకరించినందుకు ధన్యవాదాలు’ అంటూ తెలిపింది. ఐడెంటిటీలో త్రిష షూటింగ్‌ పూర్తయినా.. డబ్బింగ్  పని  మాత్రం ఇంకా మిగిలి ఉందని పేర్కొన్నారు.

ఇది తర్వాతి షెడ్యూల్‌లో పూర్తవుతుంది. క్రైమ్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో రూపొందుతున్న ఐడెంటిటీ విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

Related Posts

Comments

spot_img

Recent Stories