బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే రొమాంటిక్ సినిమాలు చేయాలనుందని అన్న మాటలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’, ‘లైగర్’, ‘డ్రీమ్‌గర్ల్ 2’లాంటి సినిమాలతో ప్రేక్షకులకు దగ్గర అయిన అనన్య పాండే ప్రస్తుతం వరుస సినిమాల్లో బిజీగా ఉంది.
తాజాగా ‘కంట్రోల్’ తో మరోసారి ప్రేక్షకులను పలకరించింది ఈ ముద్దుగుమ్మ. కాగా ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో అనన్య పాండే క్రేజీ కామెంట్లు చేసింది. ఇంతకీ, అనన్య ఏం మాట్లాడింది అంటే.. ‘కరణ్ జోహర్ సినిమాలో హీరోయిన్‌గా చేయాలని నాకు బలమైన కోరిక ఉంది. అలాగే, సంజయ్ లీలా భన్సాలీ నాకెంతో ఇష్టమైన డైరెక్టర్
సంజయ్ సినిమాలో ఛాన్స్ కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నట్లు తెలుస్తుంది. నిజానికి నా కెరీర్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఎన్నో డిఫరెంట్ జానర్ సినిమాల్లో నటించాను. అయితే, రొమాంటిక్, హారర్, బయోపిక్‌లలో ఎక్కువగా నటించాలనుంది”అంటూ చెప్పుకొచ్చింది ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ.