చిరు, అనీల్ ప్రాజెక్ట్ పై ఓ క్రేజీ అప్డేట్‌!

చిరు, అనీల్ ప్రాజెక్ట్ పై ఓ క్రేజీ అప్డేట్‌! చిరంజీవి హీరోగా “విశ్వంభర” మూవీ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. మరి తన నుంచి స్ట్రైట్ సినిమాగా ఇది వస్తుండగా భారీ అంచనాలు ఈ సినిమాపై నెలకొన్నాయి. అయితే ఈ చిత్రం తర్వాత దర్శకుడు అనీల్ రావిపూడి కలయికలో సాలిడ్ ఎంటర్టైనర్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాపై ఓ క్రేజీ న్యూస్ ఇపుడు తెలుస్తుంది. రీసెంట్ గానే ఈ సినిమా మ్యూజిక్ పరంగా కూడా అనీల్ చాలా జాగ్రత్తలు తీసుకుంటానని చెప్పడం జరిగింది. అలాగే ఈ సినిమాకి కూడా సంక్రాంతికి వస్తున్నాం సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియోనే వర్క్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే మెగాస్టార్ సినిమా కోసం ఆల్రెడీ భీమ్స్ నాలుగు సాంగ్స్ ఇచ్చేశాడట. ఇది ఊహించని విషయం అని చెప్పాలి. ఇక ఈ చిత్రాన్ని అనీల్ అతి త్వరలోనే స్టార్ట్ చేయనుండగా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories