విశ్వక్‌ లైలా నుంచి క్రేజీ ప్రీ లుక్‌ పోస్టర్‌ వచ్చేసిందోచ్‌!

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తాజాగా నటించిన సినిమా “మెకానిక్ రాకీ” విజయం  తరువాత, ఆయన నుంచి రాబోతున్న మరో ఆసక్తికరమైన సినిమా  “లైలా”. ఈ చిత్రంలో విశ్వక్ ద్విపాత్రాభినయం చేస్తుండగా, ఒక పాత్రలో అమ్మాయిలా కనిపించనున్నారు. ఈ పాత్ర ఆయనకు చాలా ఛాలెంజింగ్ గా ఉందని తెలుస్తుంది.

తాజాగా, “లైలా” సినిమా నుంచి మేకర్స్ ప్రీ లుక్ పోస్టర్ విడుదల చేసి అభిమానులకు మంచి కిక్‌ ఇచ్చారు. ఈ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25 ఉదయం 11:07 నిమిషాలకు ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయనున్నట్లు చెప్పారు. ప్రీ లుక్ పోస్టర్ లో “సోనూ మోడల్ వస్తున్నాడు” అంటూ క్రేజీ టీజర్ కలకలం రేపింది.

ఈ చిత్రానికి రామ్ నారాయణ్ దర్శకత్వం వహిస్తుండగా, సాహు గారపాటి నిర్మాణ బాధ్యతలు చేపట్టారు.రొమాంటిక్ థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. “లైలా” ఫస్ట్ లుక్ ఎలా ఉండబోతుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories