ఘాటీకి విశ్వంభర అడ్డంకి!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు వశిష్ఠ డైరెక్ట్ చేస్తుండగా పూర్తి సోషియో ఫాంటసీ మూవీగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమా విడుదల ఆలస్యం కావడంతో అభిమానులు ఈ చిత్రం కోసం ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.

అయితే, విశ్వంభర మరో క్రేజీ మూవీ రిలీజ్‌కు అడ్డంకిగా మారిందని సినీ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది. అందాల భామ అనుష్క శెట్టి లీడ్ రోల్‌లో నటిస్తున్న ‘ఘాటీ’ కూడా ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ, ఆ సినిమా రిలీజ్‌పై మేకర్స్ మౌనంగా ఉన్నారు. దీంతో ముందుగా మెగాస్టార్ సినిమాను రిలీజ్ చేయాలనే ఆలోచనలో వారు ఉన్నారు.

విశ్వంభర రిలీజ్ తర్వాత ఘాటీ చిత్రాన్ని ప్రమోషన్స్ చేసుకుని రిలీజ్ చేయాలని వారు ప్లాన్ చేస్తున్నారు. మరి ఘాటీ చిత్రానికి విశ్వంభర అడ్డంకి ఎప్పడు తొలిగిపోతుందో చూడాలి.

Related Posts

Comments

spot_img

Recent Stories