దుర్గారావుకు కోటిరూపాయల బంపర్ ఆఫర్!

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై గులకరాయి విసిరిన కేసుకు సంబంధించి అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు సతీష్ అలియాస్ సత్తి అనే కుర్రవాడు నేరస్తుడిగా తేల్చి రిమాండ్ రిపోర్టును కోర్టుకు సమర్పించారు. సతీష్ సీఎం పై రాయి విసిరినట్టు తేల్చారు. అయితే ఏ2 ప్రోద్బలంతోనే సతీష్ ఇలా చేశాడని చెప్పిన పోలీసులు.. ఏ2 ఎవరు? అనేది తేల్చిచెప్పలేదు. రిమాండ్ రిపోర్టులో పేరు కూడా రాయలేదు. తెలుగుదేశం పార్టీ నాయకుడు అయిన వడ్డెర కాలనీ వాసి దుర్గారావు ఇప్పటికే పోలీసుల నిర్బంధంలో ఉన్నారు. ఆయనను ఏ2గా ఇరికించే ప్రయత్నంలో పోలీసులు ఉన్నట్టుగా తెలుస్తోంది.
ఇక్కడ కీలకమైన మరో అంశం వినిపిస్తోంది. దుర్గారావును పోలీసులు తీసుకువెళ్లిన తర్వాత ఇప్పటిదాకా అరెస్టు కూడా చూపించలేదు. అయితే దుర్గారావు ద్వారా తెలుగుదేశంలోని ఇతర నాయకుల పేర్లను చెప్పించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తోంది.

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం తరఫున బోండా ఉమామహేశ్వరరావు పోటీచేస్తున్నారు. ఆయనను ఈ కేసులో ఇరికించేందుకు పోలీసులు చూస్తున్నారని ప్రజలు భావిస్తున్నారు.
దుర్గారావును పోలీసులు తమ నిర్బంధంలో ఉంచుకుని.. తెలుగుదేశంలోని కొందరు కీలక నాయకుల పేర్లు చెప్పాలని, వారి ఆదేశాల మేరకే సతీష్ ద్వారా సీఎం మీద హత్యాయత్నం చేయించినట్లుగా చెప్పాలని ప్రలోభపెడుతున్నట్టుగా కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. తాము చెప్పినట్టుగా, తాముచెప్పిన పేర్లను వెల్లడిస్తే గనుక.. దుర్గారావుకు కోటిరూపాయల సొమ్ము ఇస్తామనే బంపర్ ఆఫర్ తో దుర్గారావును ప్రలోభపెడుతున్నట్టు ప్రజలు అనుకుంటున్నారు. ఇది హత్యాయత్నమే, తెలుగుదేశం పెద్దలే దీనిని చేయించారు అని అబద్ధాలను తయారుచేసి, అవే నిజాలని నిరూపించడానికి పోలీసులు నానా పాట్లు పడుతున్నారని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories