మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వశిష్ఠతో ఒక పెద్ద ఫాంటసీ ప్రాజెక్ట్, అనీల్ రావిపూడితో మాస్ ఎంటర్టైనర్, శ్రీకాంత్ ఓదెలతో రియలిస్టిక్ బ్యాక్డ్రాప్ డ్రామా ప్లాన్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో క్రేజీ కాంబినేషన్ చర్చల్లోకి వచ్చింది. అది చిరంజీవి, బోయపాటి శ్రీను కాంబో.
ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ ఇద్దరి కాంబినేషన్ లాక్ అయ్యే దశకు చేరుకున్నట్టుగా తెలుస్తోంది. గత కొంతకాలంగా మెగా అభిమానులు ఈ కలయిక కోసం ఎదురుచూస్తున్నారు. మాస్ సినిమాల దర్శకుడిగా బోయపాటి కి ఉన్న రేంజ్, చిరంజీవి కి ఉన్న స్క్రీన్ ప్రెజెన్స్ కలిసొస్తే, ఒక విపరీతమైన మాస్ మసాలా ఎంటర్టైనర్ ప్రేక్షకుల ముందుకు రావడం ఖాయం.
ఇద్దరూ మాస్ పరంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నవాళ్లు కావడంతో, ఈ సినిమాపై అంచనాలు మొదటి నుంచే భారీగానే ఉండే అవకాశముంది. బోయపాటి తీసే స్టైల్ కి చిరంజీవి యాక్షన్ మాస్ టచ్ కలిస్తే, ఫ్యాన్స్ కి పక్కా ఫెస్టివల్ మూవీ అయ్యే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం అధికారికంగా ఈ ప్రాజెక్ట్ గురించి ప్రకటించలేదు కానీ, ఇండస్ట్రీలో దీనిపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి.
ఈ కలయిక నిజంగా వర్కౌట్ అయితే మాత్రం మాస్ ఆడియెన్స్ కోసం మరో సాలిడ్ సినిమా వచ్చేసినట్లే. ఇప్పుడు అందరి చూపు మెగాస్టార్ బోయపాటి లాంటి మాస్ మాస్టర్ కలయికపై పడింది.