చైతూ కోసం బాలీవుడ్‌ విలన్‌!

చైతూ కోసం బాలీవుడ్‌ విలన్‌! అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం తన తాజా సినిమా ‘తండేల్’ను రిలీజ్‌కు సిద్దం చేస్తున్నాడు. చందు మొండేటి డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో సాయి పల్లవి హీరోయిన్‌గా చేస్తోంది. ఇక ఈ సినిమా తర్వాత చైతూ తన తరువాత సినిమాని కూడా ఇప్పటికే ఓకే చేశాడు. ‘విరూపాక్ష’ మూవీతో సాలిడ్ గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్‌ కార్తీక్ దండు డైరెక్షన్‌లో చైతూ తన తరువాత చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు. ఈ సినిమాను ఇప్పటికే అధికారికంగా ప్రారంభించారు. అయితే, తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో విలన్‌గా ఓ బాలీవుడ్ నటుడు నటించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో విలన్ పాత్ర ఎవరూ ఊహించని విధంగా ఉండనుందని.. అందుకోసం బాలీవుడ్ నటుడు స్పర్శ్ శ్రీవాత్సవ ఈ పాత్రకు పర్ఫెక్ట్‌గా సరిపోతాడని కార్తీక్ దండు అనుకుంటున్నాడంట. దీని కోసం ఆయన్ను సంప్రదించడం కూడా జరిగినట్లుగా తెలుస్తోంది. మరి నిజంగానే ఈ సినిమాలో బాలీవుడ్ విలన్ నటిస్తున్నాడా లేదా అనేది తెలియాల్సి ఉంది.

Related Posts

Comments

spot_img

Recent Stories