కల్కి 2 విడుదల పై పెద్ద ట్విస్ట్‌!

పాన్ ఇండియా హీరో  ప్రభాస్ హీరోగా దీపికా పడుకోణ్,  అలాగే దిశా పఠాని ఫీమేల్ లీడ్ లో దిగ్గజ నటుడు కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ వంటి వారి కలయికలో దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన సెన్సేషనల్ హిట్ చిత్రం “కల్కి 2898 ఏడీ” గురించి అందరికీ తెలిసిందే. మరి ఎన్నో భారీ అంచనాల నడుమ మధ్యన వచ్చిన ఈ సినిమా వాటిని రీచ్ అయ్యి ముందుకు దూసుకుపోతుంది. ఇక రీసెంట్ గా ఓటీటీలో కూడా విడుదలై ఇందులో కూడా సాలిడ్ రెస్పాన్స్ ని అందుకోగా కల్కి పార్ట్ 2 కోసం కూడా చాలా మంది వెయిట్‌ చేస్తున్నారు.

అయితే మొదటి సినిమా విడుదలైన  తర్వాత నిర్మాత అశ్వినీదత్ పార్ట్ 2 షూటింగ్ చాలా వరకు పూర్తయ్యింది. అంతేకాకుండా విడుదల కూడా అతి త్వరలోనే ఉంటుంది అని ఓ క్లారిటీ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఈ విషయం గురించి యంగ్ ప్రొడ్యూసర్ స్వప్న దత్ మరో  క్లారిటీ ఇచ్చారు. కల్కి పార్ట్ 2 చిత్రీకరణ దాదాపు వచ్చే ఏడాదిలో మొదలు కాబోతుందని అక్కడ నుంచి మొదలై సినిమాని 2028లో థియేటర్లలోకి తీసుకొచ్చే సన్నాహాలు చేస్తున్నట్టుగా ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. సో రెబల్ ఫ్యాన్స్ అంతా ఈ భారీ సినిమా కోసం అప్పటి  వరకు ఎదురు చూడాల్సిందే.

Related Posts

Comments

spot_img

Recent Stories