ఓజీ కథ నాదే..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ థియేటర్లలో దుమ్ములేపుతూ భారీ విజయాన్ని సాధించింది. సుజీత్ దర్శకత్వంలో వచ్చిన ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. చాలాకాలం తర్వాత పవన్ మాస్ లుక్‌లో కనబడటంతో ఫ్యాన్స్‌కు నిజమైన పండగలా మారింది.

ఇక తాజాగా ఈ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలతో కన్నడ దర్శకుడు ఆర్ చంద్రు వార్తల్లోకి వచ్చారు. ఆయన మాట్లాడుతూ తాను తెరకెక్కించిన ‘కబ్జా’ సినిమానే ‘ఓజీ’కి ప్రేరణగా తీసుకున్నారని పేర్కొన్నాడు. ఈ వ్యాఖ్యలు బయటకు రావడంతో సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది.

నెటిజన్లు మాత్రం ఆయన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందిస్తున్నారు. ‘కబ్జా’ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదని, అలాంటి సినిమాను ఆదర్శంగా తీసుకుని ‘ఓజీ’లా హిట్ చిత్రాన్ని తీయడం అసాధ్యమని కామెంట్లు చేస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories