పండగ పూట కూడా వర్కింగే!

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ఆంధ్ర కింగ్ తాలూకా ప్రస్తుతం టాలీవుడ్‌లో మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమాకు దర్శకుడిగా పి. మహేష్ బాబు వ్యవహరిస్తుండగా, ప్యూర్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది.

ఇప్పటికే షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు స్పీడ్‌గా కొనసాగుతున్నాయి. సంగీత దర్శకులు వివేక్–మెర్విన్ ఈ సినిమాకి సంగీతం సమకూరుస్తున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, దీపావళి రోజు కూడా ఈ సినిమా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పనుల్లో టీమ్ బిజీగా ఉన్నారు. దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలు మేకర్స్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అభిమానుల్లో మరింత ఉత్సాహం కనిపిస్తోంది.

టీమ్ చెప్పినట్లుగా, పండుగ రోజున కూడా తమ సినిమా పనుల్లో ఏ మాత్రం బ్రేక్ లేకుండా పనిచేస్తున్నట్లు వారు వెల్లడించారు. ఇందులో రామ్ సరసన భాగ్యశ్రీ బొర్సే హీరోయిన్‌గా నటిస్తుండగా, ప్రముఖ నటుడు ఉపేంద్ర కీలక పాత్రలో కనిపించనున్నాడు.

Related Posts

Comments

spot_img

Recent Stories