మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కెరీర్‌లో ఇటీవల వచ్చిన వరుస వైఫల్యాలు ఆయనకు కొంత వెనుకడుగు అయ్యాయి. దీంతో ప్రస్తుతం ఆయన పూర్తిగా కొత్త జోష్‌తో తిరిగి పుంజుకునే ప్రయత్నంలో ఉన్నారు. ప్రస్తుతం వరుణ్ “కొరియన్ కనకరాజు” అనే యాక్షన్ ఎంటర్‌టైనర్‌పై ఫుల్ ఫోకస్ పెట్టాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశలో కొనసాగుతోంది. సమాచారం ప్రకారం నవంబర్ చివరినాటికి అన్ని షెడ్యూల్స్ పూర్తి చేసి, తదుపరి పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నారు.
ఇదిలా ఉండగా, వరుణ్ తాజాగా మరో కొత్త ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఇండస్ట్రీ టాక్. విక్రమ్ సిరికొండ దర్శకత్వం వహించే ఈ లవ్ స్టోరీ గతేడాదే ఫైనల్ అయినప్పటికీ, కొన్ని కారణాల వల్ల ప్రారంభం ఆలస్యమైంది. కానీ ఇప్పుడు పరిస్థితులు క్లియర్ కావడంతో, వరుణ్ తేజ్ డిసెంబర్ నుంచి షూటింగ్ ప్రారంభించేందుకు తన డేట్స్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలోని ముఖ్యమైన షెడ్యూల్ అమెరికాలో ప్లాన్ చేసినట్టు తెలిసింది.