మెగాస్టార్ చిరంజీవి హీరోగా, నయనతార హీరోయిన్గా, దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న భారీ ఎంటర్టైనర్ “మన శంకర వరప్రసాద్ గారు” ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమా గురించి మొదటి నుంచే మంచి హైప్ ఉండగా, తాజాగా విడుదలైన ఫస్ట్ సింగిల్ మాత్రం ఆ అంచనాలను మరింత పెంచింది.
ఒక మాజీ భార్యాభర్తల మధ్య సాగే రొమాంటిక్ ఫీల్‌తో రూపొందిన ఈ మెలోడీ పాట, పాజిటివ్ వైబ్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. వినిపించిన వెంటనే మనసుకు హత్తుకునే ట్యూన్‌తో భీమ్స్ మ్యూజిక్ సూపర్ హిట్ సాంగ్ అందించాడు అని చెప్పవచ్చు. విడుదలైన వెంటనే యూట్యూబ్‌లో ఈ సాంగ్ ఊహించని రేంజ్లో వైరల్ అవుతూ, ప్రస్తుతం ఇండియా ట్రెండింగ్ లిస్టులో నెంబర్ వన్ స్థానం దక్కించుకుంది.
బాలీవుడ్ పాటలకంటే కూడా ఈ సాంగ్ ఎక్కువ వ్యూస్ సాధించడం అభిమానుల్లో పెద్ద ఉత్సాహం కలిగించింది. భీమ్స్ ఇచ్చిన సంగీతం, అనిల్ రావిపూడి దర్శకత్వం, చిరంజీవి–నయనతార కెమిస్ట్రీ — ఇవన్నీ కలిసి ఈ పాటను చార్ట్‌బస్టర్ హిట్‌గా మార్చేశాయి.