పెద్ది ఫస్ట్ సింగిల్‌ అప్పుడే..!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న సినిమా “పెద్ది”పై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ప్రతి అప్‌డేట్‌కి ఫ్యాన్స్ భారీగా రియాక్ట్ అవుతున్నారు. ఇప్పుడు అందరి దృష్టి ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ సింగిల్‌పై పడింది.

ఇటీవల ఈ పాట గురించి బుచ్చిబాబు సానా ఒక చిన్న హింట్ ఇచ్చాడు. ఆ పాట పూర్తిగా రొమాంటిక్ టచ్‌లో ఉండబోతోందని తెలిపారు. దీంతో అభిమానుల్లో మరింత ఉత్సాహం పెరిగింది. ఇప్పటివరకు మేకర్స్ ఈ సాంగ్‌ను రిలీజ్ చేసే అవకాశాలపై ఊహాగానాలు వినిపించాయి, కానీ ఇప్పుడు దర్శకుడే స్పష్టత ఇవ్వడంతో ఎగ్జైట్మెంట్ రెట్టింపు అయింది.

అయితే ఈ రొమాంటిక్ సాంగ్ ఎప్పుడు విడుదల అవుతుందనే అంశంపై ఇంకా అధికారిక సమాచారం బయటకు రాలేదు. దీపావళి పండుగ సమయానికే ఈ ట్యూన్‌ విడుదల అయ్యే అవకాశం ఉందని టాక్ వినిపిస్తున్నా, ఫైనల్ డేట్ కోసం మాత్రం అందరూ వేచి చూస్తున్నారు

Related Posts

Comments

spot_img

Recent Stories