స్టార్ బోయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన తాజా సినిమా “తెలుసు కదా” ఈ దీపావళి సందర్భంగా అంటే అక్టోబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ వేడుకను భారీగా నిర్వహిస్తూ సినిమా టీమ్ సందడి చేసింది.
ఈ కార్యక్రమంలో మాట్లాడిన సిద్ధు జొన్నలగడ్డ తన పాత్ర గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. సినిమాలో తాను పోషించిన “వరుణ్” అనే పాత్ర ప్రేక్షకులను కొత్తగా అనిపించేలా ఆకట్టుకుంటుందని తెలిపారు. ఈ పాత్ర ఎలాంటి రక్తపాతం లేకుండా భావోద్వేగాలతో, సైకలాజికల్ యాంగిల్‌తో ప్రేక్షకుల మనసులో తుఫాను రేపుతుందని చెప్పారు. ఈ పాయింట్ వల్ల సినిమా మీద ఉన్న ఆసక్తి మరింత పెరిగింది.
ఈ చిత్రంలో రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటించారు.