పెద్ది వచ్చేది ఆ టైం కే..గ్యారంటీ!

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న సినిమా పెద్ది ప్రస్తుతం భారీ అంచనాలతో తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్నాడు. సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచే మెగా అభిమానుల్లో మంచి బజ్ క్రియేట్ అయింది.

షూటింగ్ పనులు వేగంగా సాగుతున్నాయి. రామ్ చరణ్ ఈ చిత్రంలో కొత్త లుక్‌తో కనిపించనున్నాడని తెలిసిన తర్వాత అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది. ఇప్పటికే షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాను వచ్చే ఏడాది మార్చి 27న, అంటే రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయాలని ప్లాన్ చేశారు.

ఇటీవల రిలీజ్ డేట్ మారుతుందా అనే రూమర్స్ వస్తుండగా, మైత్రి మూవీ మేకర్స్ స్పష్టత ఇచ్చారు. నిర్ణయించిన తేదీకి మార్పు లేకుండా సినిమా సమయానికి విడుదల అవుతుందని వారు ధృవీకరించారు. అంటే అభిమానులు ఇక ఎలాంటి అనుమానాలు పెట్టుకోనవసరం లేదు.

Related Posts

Comments

spot_img

Recent Stories