మంచు లక్ష్మి ఇటీవల నటించిన క్రైమ్ థ్రిల్లర్ సినిమా “దక్ష” తాజాగా ఓటిటి రిలీజ్ కోసం రెడీ అవుతోంది. ఈ చిత్రంలో మంచు లక్ష్మి తో పాటు చిత్ర శుక్ల కూడా కీలక పాత్రలో కనిపించారు. అలాగే మంచు మోహన్ బాబు, సముద్రఖని వంటి సీనియర్ నటులు నటించిన ఈ సినిమా కొన్ని వారాల క్రితమే థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే థియేటర్ రన్ అంతగా ఆకట్టుకోకపోయినా ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కోసం మంచి ఆసక్తి కనిపిస్తోంది.
ఈ సినిమాకు సంబంధించిన ఓటిటి రైట్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. అందులో ఈ అక్టోబర్ 17 నుంచి సినిమా స్ట్రీమింగ్ కు అందుబాటులోకి రానుంది. థియేటర్ లో చూడలేకపోయిన ప్రేక్షకులు ఇప్పుడు ఓటిటిలో ఈ క్రైమ్ థ్రిల్లర్ ను చూడొచ్చు.
సంగీతం విషయానికి వస్తే, మంచు వారి సినిమాలకు తరచుగా సంగీతం అందించే అచ్చు ఈ సినిమాకి కూడా మ్యూజిక్ అందించారు.