ఓటీటీలోకి భద్రకాళి..!

తమిళ సినీ ప్రపంచంలో నటుడిగా, సంగీత దర్శకుడిగా, ఇప్పుడు దర్శకుడిగా కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న స్టార్ విజయ్ ఆంటోనీకి తెలుగు ఆడియెన్స్ లో మంచి క్రేజ్ ఉంది. ఈ ఏడాదిలోనే ఆయన నటించిన రెండు థ్రిల్లర్ సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. వాటిలో తాజాగా వచ్చిన పొలిటికల్ థ్రిల్లర్ “భద్రకాళి” మంచి స్పందన తెచ్చుకుంది.

అరుణ్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ సినిమా థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ రన్ పూర్తి చేసుకొని ఇప్పుడు ఓటిటి స్ట్రీమింగ్ కి సిద్ధమైంది. ఈ చిత్రానికి డిజిటల్ హక్కులు జియో హాట్ స్టార్ వారు తీసుకున్నారు. అక్టోబర్ 24 నుండి ఈ సినిమా తెలుగు, తమిళం మాత్రమే కాకుండా కన్నడ, మలయాళ భాషల్లో కూడా స్ట్రీమ్ కానుంది.

ఈ చిత్రానికి సంగీతం అందించినది కూడా విజయ్ ఆంటోనీనే. అంతేకాదు, నిర్మాతగా కూడా ఈ ప్రాజెక్ట్‌ కి ఆయనే వ్యవహరించారు.

Related Posts

Comments

spot_img

Recent Stories