మెగా సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ ప్రస్తుతం నటిస్తున్న కొత్త సినిమా సంబరాల ఏటి గట్టు టాలీవుడ్ లో మంచి హైప్ సృష్టిస్తోంది. ఈ సినిమాని యువ దర్శకుడు రోహిత్ కేపి రూపొందిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ షూటింగ్ దాదాపు పూర్తయింది. మొదటి నుంచే రూరల్ యాక్షన్ డ్రామా అని చెప్పుకుంటూ వస్తున్న ఈ సినిమా గురించి తాజాగా మరో ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది.
ఇండస్ట్రీ టాక్ ప్రకారం, ఈ సినిమాలో యాక్షన్, ఎమోషన్ తో పాటు మైథలాజికల్ టచ్ కూడా ఉంటుందట. అంటే కేవలం గ్రామీణ నేపథ్యం కాకుండా, కథలో దేవతలకి సంబంధించిన ఎలిమెంట్స్ కూడా జోడించినట్టు తెలుస్తోంది. ఇలాంటి మిశ్రమ కాన్సెప్ట్ తో హనుమాన్ సినిమాకు మంచి విజయం వచ్చిన విషయం తెలిసిందే. అందుకే ఈ ప్రాజెక్ట్ పట్ల కూడా ప్రేక్షకుల్లో కొత్త ఆసక్తి పెరిగింది.