ఇది మామూలు జాక్‌పాట్‌ కాదు!

మౌలి తనుజ్ యూట్యూబ్‌ నుండి సినిమాల్లోకి అడుగుపెట్టిన హీరో. రీసెంట్ గా వచ్చిన ‘లిటిల్ హార్ట్స్’ సినిమాతో మౌలి పెద్ద విజయం సాధించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టడం, ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రిస్పాన్స్ రావడం అతని కెరీర్‌కి పెద్ద మైలురాయిగా మారింది.

ఇప్పుడు సినీ పరిశ్రమలో వినిపిస్తున్న వార్తల ప్రకారం, మౌలి తన తదుపరి ప్రాజెక్ట్ కోసం మైత్రీ మూవీ మేకర్స్‌ భారీ రెమ్యునరేషన్ ఇచ్చారు. ఒక్క సినిమాతోనే ఇంత భారీ ఖర్చు పెట్టడం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

ఇండస్ట్రీలో ఒక్క హిట్ తర్వాత భారీ ప్రాజెక్ట్‌కి అవకాశాలు పొందడం సాధారణమే. నిర్మాతలు హీరోపై నమ్మకం ఏర్పడిన తర్వాత మాత్రమే అతనికి భారీ రెమ్యూనరేషన్ ఇవ్వడం సర్వసాధారణం.

ఇలాంటి పరిస్తితిలో, అదే మైత్రీ మూవీ మేకర్స్ తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ కోసం ‘డ్యూడ్’ సినిమా కోసం 13 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు సమాచారం. మౌలి ‘లిటిల్ హార్ట్స్’తో తన కెరీర్‌కి బాగా లక్ జాక్‌పాట్ కొట్టాడని, సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి.

Related Posts

Comments

spot_img

Recent Stories