టాలీవుడ్‌లో ప్రస్తుతం ఎదుగుతున్న యువ హీరోలలో కిరణ్ అబ్బవరం పేరు తప్పక వినిపిస్తుంది. తక్కువ కాలంలోనే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ యంగ్ హీరో, విజయాలు మాత్రమే కాదు నెగిటివ్ ఫేజ్‌ను కూడా ఎదుర్కొన్నాడు. అయితే ఆ దశను దాటుకొని ఇప్పుడు ప్రేక్షకుల మనసుల్లో మళ్లీ స్థానం సంపాదించుకుంటున్నాడు.
ఇప్పుడేమో కిరణ్ తనపై వచ్చే సింపతీని పూర్తిగా తిరస్కరిస్తున్నాడు. తన సినిమా ట్రైలర్ లేదా టీజర్ నచ్చితేనే ప్రేక్షకులు థియేటర్‌కి రావాలని, కేవలం తనపై కనికరం వల్ల సినిమా చూడొద్దని స్పష్టంగా చెబుతున్నాడు. అంటే తాను సింపతీ ఆధారంగా కాకుండా తన కంటెంట్ మీదే నిలబడాలని భావిస్తున్నాడు.
ఇటీవల ఆయన పలు ఇంటర్వ్యూల్లో కూడా తాను ఎదుర్కొన్న నెగిటివ్ ఫేజ్ గురించి నిజాయితీగా మాట్లాడాడు. ఆ మాటలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యి కిరణ్‌కి సానుభూతి చూపించే వాళ్లు పెరిగారు. కానీ అలా వచ్చే ఆదరణ తనకి అవసరం లేదని ఆయన తాజాగా చెప్పడంతో మళ్లీ చర్చకు దారితీసింది.