ఓటీటీలోకి ఓజీ ఎప్పుడంటే..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటించిన తాజా యాక్షన్ ఎంటర్‌టైనర్ “ఓజి” సినిమా ఇప్పుడు మరోసారి హైలైట్ అవుతోంది. థియేటర్స్‌లో భారీగా వసూళ్లు సాధించి, అభిమానులని బాగా ఆకట్టుకున్న ఈ చిత్రం త్వరలోనే ఓటిటి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉందన్న టాక్ ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది.

సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీని పవన్ కెరీర్‌లో కొత్త యాక్షన్ ఫ్రాంచైజ్ ఆరంభంగా చూస్తున్నారు. థియేట్రికల్ రన్ సమయంలో మంచి రెస్పాన్స్ వచ్చిన తర్వాత, ఇప్పుడు డిజిటల్ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నవారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది.

తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా అక్టోబర్ 23నుంచే ఓటిటిలో స్ట్రీమింగ్ కాబోతోందని టాక్. నెట్‌ఫ్లిక్స్ ఈ చిత్రానికి డిజిటల్ హక్కులు సొంతం చేసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రావాల్సి ఉంది.  

Related Posts

Comments

spot_img

Recent Stories