పాన్ ఇండియా స్థాయిలో భారీగా హైప్ క్రియేట్ చేసిన రీరిలీజ్ మూవీగా “బాహుబలి ది ఎపిక్” ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తెలుగు సినిమాకి మాత్రమే కాకుండా మొత్తం ఇండియన్ సినిమాకి కొత్త చరిత్ర సృష్టించిన బాహుబలి సిరీస్ ని ఇప్పుడు దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి తన టీమ్‌తో కలసి ఒకే సినిమాగా మళ్లీ కొత్తగా ప్రెజెంట్ చేయబోతున్నారు. ఈ స్పెషల్ కట్ కోసం ప్రభాస్ అభిమానులు మాత్రమే కాదు, సాధారణ సినీ ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ సారి మేకర్స్ ఎలాంటి సాధారణ రీరిలీజ్ కాదు, పూర్తిగా కొత్త థియేట్రికల్ అనుభవాన్ని ఇవ్వడానికి భారీ ప్లానింగ్ చేశారు. సినిమాను ఆధునిక టెక్నాలజీలతో అప్డేట్ చేసి, ఐమ్యాక్స్, డాల్బీ సినిమా, 4డిఎక్స్, డి బాక్స్, ఎపిక్యూ, ఐస్ థియేటర్స్ వంటి అన్ని ప్రీమియం ఫార్మాట్స్‌లో విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. హైదరాబాద్‌లోని అతిపెద్ద పీ సి ఎక్స్ స్క్రీన్ మీద కూడా ఈ ఎపిక్ మూవీని చూపించబోతున్నారని సమాచారం.
ఈ రీరిలీజ్ తో ప్రేక్షకులకు కొత్తగా, మరింత గ్రాండ్‌గా థియేట్రికల్ ఫీల్ ఇవ్వాలని టీమ్ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన అనుభవాన్ని అందించబోయే ఈ ప్రత్యేక ఎడిషన్ అక్టోబర్ 31న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతుంది.