ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలపై బజ్ ఎక్కువగా నడుస్తోంది. ఈ ఏడాదిలోనే ఆయన హరిహర వీరమల్లు మరియు ఓజీ సినిమాల ద్వారా అభిమానులను పలకరించిన సంగతి అందరికీ తెలుసు. ఇక ఇప్పుడు ఆయన చేతిలో ఉన్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఈ ప్రాజెక్ట్ షూటింగ్ మీదే ప్రస్తుతం ఆయన ఎక్కువ దృష్టి పెట్టారు.
అయితే ఇటీవల సోషల్ మీడియాలో పవన్ కొత్త సినిమాలకు ఒప్పుకున్నారని పలు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. కానీ తాజా సమాచారం ప్రకారం ఆ రూమర్స్‌లో నిజం లేదట. పవన్ కళ్యాణ్ ప్రస్తుతానికి కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని, ఆయన పూర్తి దృష్టి రాజకీయ కార్యకలాపాల మీదే ఉన్నట్టు తెలుస్తోంది.
అందువల్ల ఆయన ఈ దర్శకుడితో సినిమా చేస్తున్నారంటూ వచ్చిన వార్తలు కేవలం ఊహాగానాలే అన్నమాట. ఇక ఆయన నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మాత్రం వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని టీమ్ ప్లాన్ చేస్తోంది.