థియేటర్స్‌లో సినిమాలు వరుసగా రిలీజ్ అవుతున్నా, ప్రేక్షకులు ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ పైన కూడా మంచి ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే, ఈ డిజిటల్ వేదికలపై కూడా కొత్త కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు వరుసగా వస్తూనే ఉన్నాయి. ప్రేక్షకుల రుచికి తగ్గట్టుగా వినూత్న కథలతో ఓటీటీ సంస్థలు ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్‌ను అందిస్తున్నాయి.
ఇలాంటి ట్రెండ్‌లో యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ కూడా తన కొత్త ప్రాజెక్ట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సన్నద్ధమయ్యాడు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం పేరు ‘తక్షకుడు’. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.
యాక్షన్, థ్రిల్లర్ అంశాలతో రూపొందుతున్న ఈ చిత్రానికి వినోద్ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా విడుదలైన పోస్టర్‌లో “వేటలో జింక పిల్లలే నేరస్థులంటూ” చెప్పిన లైన్ సినిమాపై ఆసక్తిని పెంచింది. ఈ పోస్టర్ చూసిన తర్వాత ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.