‘కాంతార చాప్టర్ 1’ సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుంచి మాత్రమే కాకుండా సినీ ప్రముఖుల నుంచీ కూడా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. అయితే ఆ సన్నివేశాల వెనక ఉన్న కష్టాన్ని ఇప్పుడు రిషబ్ శెట్టి స్వయంగా బయటపెట్టాడు.
తాజాగా సోషల్ మీడియాలో ఆయన కొన్ని ఫోటోలు షేర్ చేస్తూ, ఆ క్లైమాక్స్ సన్నివేశాలను షూట్ చేసినప్పుడు ఎదురైన కష్టాల గురించి చెప్పాడు. ఆ ఫోటోలలో ఆయన బాగా అలసిపోయినట్టు కనిపించాడు. షూటింగ్ సమయంలో తన కాళ్లు వాచిపోవడం, శరీరం పూర్తిగా అలసటకు గురైపోవడం వంటి అనుభవాలను గుర్తు చేసుకున్నాడు. అయినా కూడా ప్రేక్షకులు ఇప్పుడు ఆ సన్నివేశాలను ఎంతగా ఇష్టపడుతున్నారో చూడడం తనకు గర్వంగా ఉందని తెలిపాడు.
అదే సమయంలో రిషబ్ శెట్టి, కాంతార క్లైమాక్స్ అద్భుతంగా రావడానికి కారణం తన జట్టు చేసిన కష్టమే కాకుండా దైవానుగ్రహమని చెప్పాడు. ప్రేక్షకులు చూపుతున్న ఆదరణకు, మద్దతుకు కృతజ్ఞతలు తెలిపాడు.