ఐశ్వర్య త్యాగాల వల్లే ఇక్కడ!

తాజాగా జరిగిన 70వ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌లో అభిషేక్‌ బచ్చన్‌ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా ఆయన చెప్పిన మాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా గత కొన్ని రోజులుగా అభిషేక్‌–ఐశ్వర్యల మధ్య విభేదాలు ఉన్నాయన్న వార్తలు చక్కర్లు కొడుతున్న వేళ, తన భార్య గురించి చెప్పిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.

అభిషేక్‌ మాట్లాడుతూ తన సినీ ప్రయాణం అంత తేలికగా సాగలేదని, ఎన్నో ఎత్తుపల్లాలు ఎదుర్కొన్న తర్వాతే ఈ స్థాయికి చేరుకున్నానని తెలిపారు. సినిమా రంగంలో తనను నమ్మి అవకాశాలు ఇచ్చిన దర్శకులు, నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవార్డు తనకు ఎంతో ప్రత్యేకమని, ఇది తన 25 ఏళ్ల ప్రయాణానికి గుర్తుగా నిలుస్తుందని అన్నారు.

అలాగే, ఈ విజయానికి వెనుక తన భార్య ఐశ్వర్యారాయ్‌ మరియు కూతురు ఆరాధ్య ఉన్నారని అభిషేక్‌ ప్రస్తావించాడు. కుటుంబం ఇచ్చిన మద్దతు, ఐశ్వర్య చేసిన త్యాగాల వల్లనే తాను ఈ స్థాయికి వచ్చానని ఆయన హృదయపూర్వకంగా చెప్పాడు. తన జీవితంలో ఐశ్వర్య పాత్ర ఎంతో కీలకమని, ఈ అవార్డు ఆమెకు అంకితం చేస్తున్నానని స్పష్టంగా తెలిపాడు.

Related Posts

Comments

spot_img

Recent Stories