బన్నీ మూవీ కోసం భారీ సెట్‌!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మాస్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కిస్తున్న కొత్త సినిమా చుట్టూ ఇప్పటికే మంచి హైప్ నెలకొంది. ఈ కాంబినేషన్ ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని రేపుతోంది. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాలోని ఒక స్పెషల్ యాక్షన్ ఎపిసోడ్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ స్థాయిలో సెట్స్ వేస్తున్నారట. ఈ సీక్వెన్స్ లో అల్లు అర్జున్ తో పాటు ఇతర ముఖ్య పాత్రధారులు కూడా పాల్గొనబోతున్నారు. ఈ సన్నివేశాల్లో యాక్షన్ సీన్స్ చాలా స్టైలిష్ గా, విజువల్ గా గ్రాండ్ గా ఉండబోతున్నాయని సమాచారం.

బన్నీ ఈ ఎపిసోడ్ లో కనిపించే లుక్, అతని ప్రెజెంటేషన్ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేలా ఉంటుందట. అల్లు అర్జున్ పాత్రలో ఎన్నో వేరియేషన్స్ ఉంటాయని, ముఖ్యంగా రెండో భాగంలో వచ్చే ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ సినిమాలో హైలైట్ అవుతుందని చెబుతున్నారు. ఆ ఫ్లాష్‌బ్యాక్ సన్నివేశాల్లో మాస్ యాక్షన్ తో పాటు ఎమోషన్ కూడా బలంగా ఉండబోతోందట.

కథ మొత్తం మాఫియా బ్యాక్‌డ్రాప్ లో సాగుతుందని టాక్. అల్లు అర్జున్ ఒక డాన్ పాత్రలో కనిపిస్తాడని సమాచారం.

Related Posts

Comments

spot_img

Recent Stories