మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా సినిమా మన శంకర వరప్రసాద్ గారు ఇప్పటి నుంచే సినిమాపై ప్రేక్షకుల్లో పెద్ద అంచనాలు నెలకొన్నాయి. ఈ ప్రాజెక్ట్‌తో చిరంజీవి మరోసారి బాక్సాఫీస్‌ను శాసిస్తారనే నమ్మకంతో ఫ్యాన్స్ చాలా ఉత్సాహంగా ఉన్నారు.
ఇటీవల ఈ సినిమాలోని మీసాల పిల్ల అనే పాట ప్రోమోను విడుదల చేయగా, అది సోషల్ మీడియాలో హల్చల్ సృష్టిస్తోంది. మెలోడి టచ్‌తో ఉన్న ఈ పాటకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ప్రోమో చూసినవాళ్లు పూర్తి సాంగ్ కోసం ఎదురుచూస్తున్నారు.
సినిమా యూనిట్ సమాచారం ప్రకారం, ఈ పాటను అక్టోబర్ 13న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అనిల్ రావిపూడి సరదా స్టైల్లో ప్రమోషన్స్ మొదలుపెట్టగా, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలోని బుల్లి రాజుతో కలిసి ఈ అప్డేట్ను ఫ్యాన్స్‌కి తెలిపారు.
భీమ్స్ సిసిరోలియో అందించిన ఈ మ్యూజిక్ ఇప్పటికే ఫ్యాన్స్ మనసులు దోచేస్తోంది. పూర్తిగా రిలీజ్ అయ్యే సరికి ఈ సాంగ్ ఎంత హిట్ అవుతుందో చూడాలి.