టాలీవుడ్ లవ్‌బుల్ హీరో విజయ్ దేవరకొండ ఇటీవల నటించిన కింగ్డమ్ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయిన విషయం తెలిసిందే. ఆ సినిమాతో వచ్చిన నిరాశను పక్కనపెట్టి, విజయ్ ఇప్పుడు తన తదుపరి ప్రాజెక్ట్ పై పూర్తి ఫోకస్ పెట్టాడు. ఈసారి ఆయన యువ దర్శకుడు రవికిరణ్ కోలాతో కలిసి పని చేయబోతున్నాడు. ఈ సినిమా కోసం విజయ్ తన లుక్, స్టైల్ అన్నీ కొత్తగా మార్చుకున్నాడని సమాచారం.
ఇక ఈ ప్రాజెక్ట్‌లో కీర్తి సురేష్ కూడా భాగమవుతున్నట్టుగా గతంలో ప్రచారం జరిగింది. ఆ వార్తలు నిజమని ఇప్పుడు అధికారికంగా స్పష్టమైంది. సినిమా ముహూర్తం సందర్భంగా విజయ్ దేవరకొండతో పాటు కీర్తి సురేష్ కూడా పాల్గొనడంతో ఆ టాక్ కన్ఫర్మ్ అయింది.
ఇప్పుడేమో ఈ ఇద్దరి జోడీ తెరపై ఎలా కనెక్ట్ అవుతుందా అన్న ఆసక్తి పెరిగింది. కీర్తి సురేష్ ఏ రకమైన పాత్రలో కనిపించబోతుందో మేకర్స్ సీక్రెట్ గా ఉంచారు.