తన రచ్చలోకి జగన్ లాగుతున్న పేర్ని నాని!

అవును మరి.. వివాదం పుట్టించినా సరే.. నిజాలను మాత్రమే ప్రచారం చేస్తే దానికి పెద్ద ప్రజాదరణ ఉండదు. సోషల్ మీడియాల్లో వైరల్ చేయడమే జీవితంగా అందరూ బతుకుతున్న రోజులివి. మరి మామూలు వివాదానికి కూడా సెలబ్రిటీని జోడిస్తే.. దానికి క్రేజ్ పెరుగుతుంది కదా. ఈ చిన్న సూత్రం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కి చెందిన మాజీ మంత్రి పేర్ని నానికి కూడా చాలా బాగా తెలుసు. అందుకే ఆయన తన నియోజకవర్గంలో పోలీసుల మీదకు దూసుకెళ్లి.. స్టేషన్ లో తన అరాచకత్వాన్ని ప్రదర్శించడం మాత్రమే కాకుండా.. తన బెదిరింపులకు లొంగకుండా దీటుగా వ్యవహరించిన పోలీసు అధికారిని ఇరికించడానికి జగన్ పేరును కూడా అడ్డగోలుగా వాడుకుంటున్నారు. జగన్ పేరు చెప్పి ఇరికిస్తే తప్ప.. ఒకవేళ వాళ్ల ప్రభుత్వం వస్తే.. ఆ పోలీసు అధికారి మీద చర్యలు తీసుకోవడం సాధ్యం కాదేమో అని ఆయన భావిస్తున్నట్టుగా ఉంది.  

వివరాల్లోకి వెళితే.. మచిలీపట్నంలో సోషల్ మీడియలో అనుచిత పోస్టులు పెట్టినందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు సుబ్బన్నను పోలీసులు అరెస్టు చేశారు. అయితే సుబ్బన్నను తక్షణం విడుదల చేయాలనే దబాయింపుతో.. మాజీ మంత్రి పేర్ని నాని పోలీసు స్టేషన్ మీదికి దాదాపుగా దండెత్తి వెళ్లారు. అక్కడి అధికారితో వాగ్వాదం పెట్టుకున్నారు. ఒక రేంజిలో రెచ్చిపోయారు. ఇప్పటికిప్పుడు విడుదల చేస్తావా లేదా? బయటకు పంపుతావా లేదా? అంటూ ఎగబడ్డారు. పోలీసు అధికారి మాత్రం.. ఆయనను చట్టప్రకారం అరెస్టు చేస్తామని.. విడిచిపెట్టడం కుదరదని ఖరాఖండిగా తేల్చిచెప్పారు.

పేర్ని నాని అంతటితో వదలిపెట్టలేదు. ‘మీ ఇష్టం వచ్చినట్టుగా చేస్తారా? రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ సంగతి చూస్తాం’ అంటూ రెచ్చిపోయారు. అయితే పోలీసు అధికారి తగ్గలేదు. వైసీపీకి చెందిన ప్రతి నాయకుడూ ‘మా ప్రభుత్వం వస్తే’ అని బెదిరించడం పరిపాటి అయిపోయింది. ఈ నేపథ్యంలో పోలీసు అధికారి గట్టిగానే జవాబిచ్చారు. ‘మీసంగతి చూస్తాం’ అని బెదిరిస్తోంటే.. ‘ఏం చేస్తారో చేసుకోండి.. వదలడం మాత్రం కుదరదు’ అని అన్నారు. పేర్ని నాని మరింత రెచ్చిపోయి ‘నువ్వు మాత్రం ఏం చేస్తావు.. సుబ్బన్నను ఉరేస్తావా? ఉరేయ్.. ఇప్పుడే ఉరి వేయ్’ అంటూ పెద్దపెద్దగా కేకలు పెట్టారు. కానీ పోలీసులు దృఢంగా వ్యవహరించారు.
అసలు కామెడీ ఆ తర్వాత జరిగింది.

స్టేషనునుంచి బయటకు వచ్చిన పేర్ని నాని.. ఈ రచ్చలోకి జగన్ పేరును కూడా లాక్కొచ్చారు. ఆ పోలీసుఅధికారి ‘జగన్ వస్తే ఏం చేస్తాడు’ అని అన్నట్టుగా మీడియా ముందు ఆరోపణలు గుప్పించారు. నిజానికి ఆ అధికారి జగన్ పేరు ప్రస్తావించనేలేదు. అయినా సరే.. జగన్ పేరు పెట్టి అధికారి తిట్టినట్టుగా ప్రచారంలో పెడితే.. కాస్త మసాలా జోడించినట్టుగా ఉంటుందని పేర్నినాని భావించి ఉంటారని ప్రజలు నవ్వుకుంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories