టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున తన కెరీర్లో 100వ సినిమాతో కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. ఎటువంటి హడావిడి లేకుండా సైలెంట్‌గా ఈ ప్రాజెక్ట్ ప్రారంభమైంది. తమిళ దర్శకుడు ఆర్. కార్తీక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా గురించి ఇండస్ట్రీలో ఇప్పటికే మంచి చర్చ నడుస్తోంది. ఈ సినిమాకు “లాటరీ కింగ్” అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని సమాచారం.
నాగార్జునకు ఇది మైలురాయి లాంటి సినిమా కావడంతో ఇందులోని ప్రతి అంశం ప్రత్యేకంగా ఉండబోతుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్గా సీనియర్ నటి టబూ కనిపించనుందనే వార్త సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. నాగ్–టబూ జంట గతంలో ‘నిన్నే పెళ్లాడతా’ చిత్రంతో ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయింది. ఆ తర్వాత వారు ‘ఆవిడా మా ఆవిడే’ సినిమాలో కూడా కలిసి నటించారు. ఆ తర్వాత ఈ జంట మరోసారి కలిసి కనిపించలేదు.
ఇప్పుడీ మైల్స్టోన్ సినిమా కోసం మళ్లీ టబూను ఎంపిక చేశారన్న వార్త బయటకు రావడంతో అక్కినేని అభిమానులు ఎంతో ఆనందంగా ఉన్నారు.