ఆంధ్ర కింగ్‌ తాలూకా టీజర్‌ ఎప్పుడంటే!

యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నటిస్తున్న కొత్త సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా ఇప్పుడు సినిమా ప్రేమికుల్లో మంచి ఆసక్తి రేపుతోంది. ఈ సినిమాను దర్శకుడు పి. మహేశ్ బాబు తెరకెక్కిస్తుండగా, ఇది పూర్తిగా రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, సాంగ్స్ ఇలా అన్ని కలిపి ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో హైప్‌ను పెంచాయి.

తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా టీజర్‌ను అక్టోబర్ 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. టీజర్ చాలా స్టైలిష్‌గా, ఎంటర్‌టైనింగ్‌గా ఉండబోతుందనే నమ్మకాన్ని చిత్ర బృందం వ్యక్తం చేస్తోంది. రామ్ పోతినేని ఎనర్జీకి తగ్గట్టుగా టీజర్ కూడా ప్యాక్డ్‌గా ఉండబోతుందట.

ఈ సినిమాలో రామ్‌తో పాటు కన్నడ నటుడు ఉపేంద్ర, సుందరి భాగ్యశ్రీ బొర్సె వంటి నటీనటులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. సంగీతాన్ని తమిళ మ్యూజిక్ డైరెక్టర్స్ వివేక్-మెర్విన్ అందిస్తుండగా, సినిమాను ప్రముఖ బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.

Related Posts

Comments

spot_img

Recent Stories